అక్షరటుడే, కామారెడ్డి : Lingapur | కామారెడ్డి (Kamareddy) మండలం లింగాపూర్ గ్రామంలో శుక్రవారం కనిపించిన దృశ్యం కళ్లను చెమ్మగిల్లేలా చేసింది. తండ్రి చనిపోగా కొడుకు లేని ఇంట్లో చిన్న కూతురే అన్నీ తానై నిలిచింది.
Lingapur | ఇద్దరు కూతుళ్లు
లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల బాలయ్య శుక్రవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు స్వరూపను మెదక్(Medak) జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చిన్న కూతురు జ్యోతికి మాచారెడ్డికి(machareddy) చెందిన వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. పెళ్లైన ఆరు నెలలకే భర్త ఉపాధి కోసం దుబాయ్(Dubai) వెళ్లగా అక్కడే అనుకోకుండా మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రుల వద్ద లింగాపూర్లోనే ఉంటోంది.
బాలయ్య మృతి చెందడంతో అంత్యక్రియలు చేయడానికి వారసులు లేకుండా పోయారన్న బాధ అందరిని కలిచివేసింది. దాంతో తానే అంత్యక్రియలు చేస్తానని చిన్న కూతురు ముందుకొచ్చింది. తండ్రి పార్థివదేహం వద్దకు వచ్చిన జ్యోతి కన్నీరు దిగమింగుకుంది. గ్రామ పెద్దల సమక్షంలో తానే చితికి నిప్పంటించింది. కష్టాలు ఎన్ని వచ్చినా తల్లిదండ్రులను వదలని కూతురు, తండ్రి చివరి బాధ్యతను కూడా తానే మోసింది.

ఇది కూడా చదవండి: ‘ఈ ఏడాది నుంచి తల్లిదండ్రులు లేని 50 మంది యువతులకు ఆర్థిక సహాయం చేసి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను’ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్