KTR Student Sponsorship | 50 మంది విద్యార్థినుల చదువు ఖర్చు భరిస్తా.. కేటీఆర్​ కీలక ప్రకటన

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ దాతృత్వం చాటుకున్నారు. 50 మంది పేద విద్యార్థినుల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Student Sponsorship | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ దాతృత్వం చాటుకున్నారు. 50 మంది పేద విద్యార్థినుల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు.

టచ్​ ఎ లైఫ్​ థీమ్‌తో స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన స్పర్ష- 2026 వార్షిక కార్యక్రమంలో కేటీఆర్​ పాల్గొన్నారు. త్వరలో తాను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్​ తెలిపారు. ఈ ఏడాది నుంచి తల్లిదండ్రులు లేని 50 మంది నిరుపేద విద్యార్థినుల ఉన్నత చదువుల ఖర్చును తన సొంత డబ్బులతో స్పాన్సర్‌షిప్ అందిస్తానని తెలిపారు. సమాజానికి మన వంతు సాయం అందించడమే నిజమైన మానవత్వం అన్నారు. మహిళల సాధికారతకు తన పూర్తి సహకారం ఉంటుందన్నారు.

KTR Student Sponsorship | కీలక వ్యాఖ్యలు

ktr students

ఈ సమావేశంలో కేటీఆర్​ మాట్లాడుతూ.. నా కూతురికి 17 ఏళ్లు, ఈ ఏడాదే ఆమె కళాశాలలో అడుగుపెట్టబోతోంది. ఒకవేళ ఆమెకు తండ్రి గానీ, తల్లిదండ్రులు గానీ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో నేను ఊహించుకోగలను. జీవితంలో ఆమె ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది, అప్పుడు ఆమె పరిస్థితి ఏమయ్యేదో! అందుకే తాను 50 మంది విద్యార్థినులకు (KTR Student Sponsorship) సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మనిషిగా జీవించడంలో అర్థమే లేదు… ఒకవేళ మనలో ఆ సానుభూతి లేకపోతే అన్నారు. కాగా ఓ యువతి మాట్లాడుతూ.. ‘మీతో ఒక ఫోటో దిగడం నా డ్రీమ్ సార్’ అని కోరింది. దీంతో వెంటనే స్టేజీ పైకి వెళ్లి ఆమెతో కేటీఆర్ ఫొటో దిగారు.

 

దీనిని కూడా చదవండి : Anitha Radhakrishnan Arrest | సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *