అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Fire Services Association | తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవల సంఘం నిజామాబాద్(Nizamabad) జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
Nizamabad Fire Services Association |జిల్లా కార్యవర్గం ఇదే..
తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సేవల సంఘం నిజామాబాద్ అధ్యక్షుడుగా పి. వంశీకృష్ణ రెడ్డి (బోధన్), వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కె. ప్రశాంత్ గౌడ్, ఎ. సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా ఈ.రంజిత్ (బాల్కొండ), సంయుక్త కార్యదర్శులుగా బి. సురేష్ (నందిపేట్), కె. సురేందర్ (నిజామాబాద్), కోశాధికారిగా ఇ. సాయిలు (నిజామాబాద్), ఆర్గనైజింగ్ సెక్రెటరీగా టి. యేసురత్నం (నిజామాబాద్) ఎన్నికయ్యారు. రాష్ట్రస్థాయి తాత్కాలిక కార్యవర్గంలోనూ నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుల సలహాదారుగా దామోదర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. శ్రీనివాస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్. ఆనంద్, రాష్ట్ర కోశాధికారిగా కె. కృష్ణ నియమితులయ్యారు.
Nizamabad Fire Services Association | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి..
నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పదోన్నతులు, సీనియారిటీ, సర్వీస్ నిబంధనలు, ఉద్యోగ భద్రత వంటి అంశాల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల ఆస్తులు, ప్రాణాలను కాపాడుతున్న సిబ్బందికి తగిన గుర్తింపు, న్యాయం జరిగేలా పోరాడుతామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘వృషకర్మ’ ప్రమోషన్స్‌లో మీనాక్షి లుక్ అదుర్స్..!