అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bharat Summit | రాహుల్ ప్రధాని అవుతారని బీజేపీకి భయం పట్టుకుందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అందుకే భారత్ సమ్మిట్‌కు ఆయన హాజరు అవుతుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుందని విమర్శించారు.
భారత్ సమ్మిట్‌పై శుక్రవారం సీఎం మీడియాతో మాట్లాడారు. భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని చెప్పారు. ఆయన పర్యటనపై బీజేపీకి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను అవమానించడం సరికాదన్నారు. రాహుల్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడని, ఆయనకు కేబినెట్ హోదా ఉందని గుర్తు చేశారు. మోదీ ఏం చేసినా కరెక్ట్.. రాహుల్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు.
Bharat Summit | పెట్టుబడులకు అనుకూలం
తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రమని సీఎం అన్నారు. ఇక్కడి వ్యాపార అవకాశాలు ప్రపంచ దేశాలకు వివరించడానికే భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు ముందు సైతం భారత్ సమ్మిట్ నిర్వహించామన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.
Bharat Summit | ఆ పార్టీలు తెలంగాణకు వ్యతిరేకం
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని సీఎం వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ సమ్మిట్’కు వచ్చే ప్రతినిధుల వీసాలను కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో రద్దు చేస్తోందని ఆరోపించారు. కిషన్ రెడ్డి, రామచంద్ర రావు, కేటీఆర్ వంటి నేతలు దీనిని “భారత్ వ్యతిరేక సమ్మిట్” అని విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటుంటే, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వాటిని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని కూడా చదవండి : Peacock Hunting Arrest | నెమళ్లను వేటాడిన ఐదుగురి అరెస్ట్