అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha | సిద్దిపేటలో హరీశ్‌రావు (Harish Rao)ను ఓడిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సిద్దిపేటలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సిద్దిపేటలో రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను ఓ వ్యక్తి 500 గజాలు ఇస్తామంటే అక్కడకు మార్చారని కవిత అన్నారు. అనంతరం హరీశ్‌రావు తండ్రి పేరు మీద పక్కనే వెయ్యి గజాల స్థలం వచ్చిందని ఆరోపించారు. ఎవరి భూములు విలువ పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను మార్చారని ప్రశ్నించారు. సిద్దిపేటను ఉద్దరించారనని హరీశ్ చెప్పుకుంటారని, కానీ ఆయన రాకముందు 120 రైస్ మిల్లులు ఉంటే ఇప్పుడు 20 కూడా లేవన్నారు.
Kavitha | కేసీఆర్‌కు వెన్నుపోటు
హరీశ్‌రావు ఎప్పుడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవటం తప్ప చేసిందేమీ లేదని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటను కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి మాదిరిగా కేసీఆర్ ఆయన చేతిలో పెట్టారన్నారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని సైతం చేశారన్నారు. హరీశ్ రాకముందే సిద్దిపేటలో సబ్ స్టేషన్లు, ఇంటింటి నల్లా ఉన్నాయన్నారు.
Kavitha | అవినీతితో సంబంధం లేదు
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిలో తనకు పైసా భాగస్వామ్యం లేదని కవిత చెప్పారు. తాను కేసీఆర్‌ను ఏదైనా పైరవీలు అడిగినట్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టు భూములు ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారని చెప్పారు. కానీ తన కుటుంబానికి అక్కడ ఎకరా భూమి కూడా లేదని స్పష్టం చేశారు.
Kavitha | హరీశ్‌రావుకు అగ్గిపెట్టె దొరకలేదు
శ్రీకాంత్ చారి కి అగ్గిపెట్టె దొరికింది కానీ హరీశ్‌రావుకి దొరకలేదని కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 12 వందల మంది అమరులయ్యారని, వారిలో 600 కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు ఎంతో మంది తెలంగాణ కోసం ఉద్యమం చేశారని కవిత గుర్తు చేశారు. వాళ్లంతా కూడా ఇప్పుడు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, కానీ హరీశ్ రావు ఆస్తులు మాత్రం భారీగా పెరిగాయని ఆరోపింఆరు. 2003, 2023 అఫిడవిట్ చూస్తేనే తేడా అర్థమవుతుందన్నారు.
దీనిని కూడా చదవండి : Bharat Summit | రాహుల్ ప్రధాని అవుతారనే బీజేపీకి భయం : సీఎం రేవంత్‌రెడ్డి