Traffic Restrictions | రేపు హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Restrictions | భారత్​ సమ్మిట్​లో పాల్గొనేందుకు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) శనివారం హైదరాబాద్​ (Hyderabad) వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రాహుల్ గాంధీ హైటెక్​ సిటీలోని శిల్పకళావేదిక నుంచి జయభేరిగ్రౌండ్స్ వరకు గిగ్​వర్కర్స్​తో కలిసి బైక్​ ర్యాలీలో పాల్గొంటారు. దీంతో నవంబర్ 14న మాదాపూర్‌లో ట్రాఫిక్ నియంత్రణలు, దారి మళ్లింపులు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తామన్నారు.

Traffic Restrictions | ఇలా వెళ్లాలి

సైబర్‌ టవర్స్ నుంచి హైటెక్స్‌కామన్ (మెటల్ చార్మినార్) వరకు, అక్కడి నుంచి HICC/నోవోటెల్ వరకు వాహనాల రాకపోకలను నియంత్రిస్తారు. సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ /కొండపూర్ వైపు వెళ్లేవారు యశోద వసంత సిటీ రోడ్ – నోవోటెల్ – RTA జంక్షన్ మీదుగా వెళ్లాలి. సైబర్ టవర్స్ నుంచి బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలు ఐకియా రోటరీ – మీనాక్షి – రోలింగ్ హిల్స్ – రాడిసన్ జంక్షన్ – గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి. కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వచ్చే వాహనాలు రాడిసన్, ఏఐజీ, ఐకియా రోటరీ మీదుగా రాకపోకలు సాగించాలి. టెక్ మహీంద్రా నుంచి మెటల్ చార్మినార్ వైపు వెళ్లాల్సిన వారు కొత్తగూడలోని CII జంక్షన్ వద్ద, బొటానికల్ గార్డెన్ వైపు టర్న్​ తీసుకోవాలి.

Traffic Restrictions | ఎన్​టీఆర్​ స్టేడియం సమీపంలో..

‘కోటి దీపోత్సవం‘ కార్యక్రమం నేపథ్యంలో నవంబర్ 14 నుండి 30 వరకు ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న NTRస్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కట్ట మైసమ్మ ఆలయం నుండి ఇందిరా పార్క్ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ నాలా వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయా మార్గాల్లో రాకపోకలు సాగించాలని పోలీసులు సూచించారు. కట్ట మైసమ్మ జంక్షన్, ఆర్​కే మఠం, ఇందిరా పార్క్ క్రాస్ రోడ్స్, బండ మైసమ్మ నుండి ధర్నా చౌక్ వరకు, ఇందిరా పార్క్ క్రాస్ రోడ్స్ నుండి అశోక్ నగర్ నాలా వరకు మార్గాల్లో వెళ్లొద్దని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Kavitha | సిద్దిపేటలో హరీశ్​రావును ఓడిస్తాం : కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *