అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mega Job Mela | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు మదన్ మోహన్ ట్రస్ట్ గుడ్‌న్యూస్ చెప్పింది.. ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘మెగా జాబ్ మేళా – 2026’ను నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటన విడుదల చేశారు.
Mega Job Mela | ఎల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో..
ఈనెల 24వ తేదీన ఎల్లారెడ్డి (Yellareddy)లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉద్యోగ మేళా జరుగనుందని ట్రస్ట్నిర్వాహకులు తెలిపారు. ఈ మేళాలో 70కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5,000 కి పైగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయని.. సుమారు 5,000 మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వారు పేర్కొన్నారు. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఐటీ & బీపీవో, సేల్స్ అండ్ మార్కెటింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఇతర ప్రైవేట్ ఉద్యోగావకాశాలున్నాయని.. 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు అర్హులని సూచించారు. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా క్యూఆర్‌కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేదా https://charmsinc.in/job-mela/registration వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: CMR Scam | మిల్లర్ల మాయాజాలం.. రూ.కోట్ల విలువైన ధాన్యం మాయం