అక్షరటుడే, వెబ్‌డెస్క్: SpaceX Rocket Debris | చంద్రుడిపై ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థకు సంబంధించిన ఫాల్కన్-9 (Falcon 9) రాకెట్ శకలం ప్రమాదవశాత్తు కూలిన ఘటనపై శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. దాదాపు 4 టన్నుల బరువున్న రోదసి వ్యర్థం (Space Debris) గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టినట్లు సమాచారం.
SpaceX Rocket Debris | ఐన్‌స్టీన్ క్రేటర్ సమీపంలో..
శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, ఈ రాకెట్ శకలం చంద్రుడి దూర వైపున ఉన్న ఐన్‌స్టీన్ క్రేటర్ సమీపంలో పడింది. ఈ ప్రభావంతో అక్కడ భారీ గుంత (క్రేటర్) ఏర్పడటంతో పాటు చంద్రుడి ఉపరితలంపై పెద్ద ఎత్తున ధూళి ఎగసిపడినట్లు గుర్తించినట్లు తెలిపారు.
Kacheguda Bus Terminal | హైదరాబాద్‌లో ప్రజా రవాణాకు ఊతం.. చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్‌కు ప్రణాళిక
SpaceX Rocket Debris | ఇది సర్వసాధారణమా…
అంతరిక్షంలోకి ప్రయోగించిన రాకెట్ల దశలు, ఇతర వ్యర్థాలు నియంత్రణ కోల్పోయిన తర్వాత రోదసిలోనే తిరుగుతూ ఉండటం సాధారణమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి రోదసి వ్యర్థాలు గ్రహాలు, ఉపగ్రహాల గురుత్వాకర్షణ ప్రభావంతో కొన్నిసార్లు వాటి ఉపరితలాన్ని ఢీకొనే అవకాశముంటుందని వివరించారు.
కాగా, చంద్రుడిపై ఏర్పడిన ఈ కొత్త క్రేటర్‌ను కక్ష్యలో పరిభ్రమిస్తున్న పరిశీలనా ఉపగ్రహాల ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఘటన అంతరిక్ష వ్యర్థాల నిర్వహణ, భవిష్యత్ చంద్ర మిషన్ల భద్రత వంటి అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది.