అక్షరటుడే వెబ్‌డెస్క్: Venezuela Earthquake | వెనిజులాలో వరుసగా సంభవించిన భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ విపత్తులో అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లూకాస్ ట్రెజో (38) తన కుటుంబాన్ని కోల్పోయి అనాథగా మిగిలారు.
Venezuela Earthquake | కోచింగ్ సెంటర్‌లో ఉండగా..
వెనిజులా సెకండ్ డివిజన్ జట్టు ‘క్లబ్ స్పోర్ట్ మారిటిమో లా గుయైరా’లో లూకాస్ ట్రెజో ( Lucas Trejo ) ఆడుతున్నారు. భూకంపం సంభవించిన సమయంలో ఆయన కరాకస్‌లోని కోచింగ్ సెంటర్‌లో ఉండగా, ఆయన నివాసం ఉంటున్న లా గుయైరాలోని ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయింది. విషయం తెలిసిన వెంటనే ట్రెజో అక్కడకు చేరుకున్నారు. తన భార్య యానినా, పిల్లలు ఆరోన్ , ఐన్హోవా ప్రాణాలతో బయటపడతారన్న ఆశతో, మూడు రోజుల పాటు ఆయన సొంతంగా శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ద్వారా సహాయం కోరినా, చివరకు ఆదివారం రోజు తన కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. ట్రెజోకు తన జట్టు యాజమాన్యం, సహచర ఆటగాళ్లు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Venezuela Earthquake | 1,400 దాటిన మృతుల సంఖ్య..
ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు 1,400 మందికి పైగా మరణించారు. మృతుల్లో చైనా, స్పెయిన్ దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారని ఆయా దేశాల రాయబార కార్యాలయాలు ధృవీకరించాయి. భూకంపం జరిగి 72 గంటల సమయం దాటిపోవడంతో, శిథిలాల కింద ఉన్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సహాయక బృందాలు ఆందోళన చెందుతున్నాయి. అయినా సరే, గల్లంతైన వేలాది మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ప్రకృతి ప్రళయం వెనిజులాను కోలుకోలేని దెబ్బ తీసింది.
ఇది కూడా చదవండి: Jagadish Reddy Counter | సీఎంకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కౌంటర్