Ayodhya Donation Case | అయోధ్య విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీం

అయోధ్య విరాళాల దుర్వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ayodhya Donation Case | అయోధ్య విరాళాల దుర్వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. కేసును అత్యవసరంగా విచారించాల్సిన పరిస్థితి లేదని ధర్మాసనం పేర్కొంది.

అయోధ్యలోని రామమందిరం కోసం ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు అందిన విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. పిటిషనర్ స్వయంగా కోర్టుకు హాజరై ఈ కేసును అత్యవసర విచారణ జాబితాలో చేర్చాలని కోరగా, జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం, కోర్టు తిరిగి తెరుచుకున్న తర్వాత ఈ అంశాన్ని విచారణకు చేపట్టాలని ఆదేశించింది.

Ayodhya Donation Case | రాష్ట్ర ప్రభుత్వంపై అనుమానాలు

ఆలయ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, వాటిని తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. అయితే, ఈ విషయంలో ఉన్న అత్యవసర పరిస్థితి ఏమిటని జస్టిస్ సుందరేష్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న తీరు… అనుమానాలకు తావిస్తోందని పిటిషనర్ సమాధానమిచ్చారు. ఇదే తరహా ఆరోపణలతో న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి కూడా మరొక పిటిషన్‌ను దాఖలు చేశారు.

Ayodhya Donation Case | కొనసాగుతున్న విచారణ

అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. ట్రస్ట్​లోని కొందరు నిధులను కాజేశారని ఆరోపణలతో ప్రభుత్వం సిట్​ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ట్రస్ట్​ జనరల్​ సెక్రెటరీగా పని చేసిన చంపత్‌ రాయ్‌ స్టేట్‌మెంట్​ను సిట్ అధికారులు రికార్డు చేశారు. కాగా ఆయన ఇప్పటికే పదవి నుంచి తప్పుకున్నారు.

ఇది కూడా చదవండి..: Home Birth Tragedy | యూట్యూబ్ చూసి ఇంట్లోనే ప్రసవం.. నిండు ప్రాణం బలి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *