Flood Prevention | వరదలపై ముందస్తు చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి

వరదలపై ముందస్తు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి తెలిపారు. పట్టణంలోని 14వ వార్డు కాకతీయ నగర్ కాలనీలో డ్రైనేజీ పూడికతీత పనులను ప్రారంభించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Flood Prevention | వరదలపై ముందస్తు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ (kamareddy municipality) ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి తెలిపారు. ఆమె పట్టణంలోని 14వ వార్డు కాకతీయ నగర్ కాలనీలో శుక్రవారం డ్రైనేజీ పూడికతీత, చెత్త తొలగింపు పనులను ప్రారంభించారు.

Flood Prevention | పునరావృతం కాకుండా..

ఛైర్​పర్సన్​ మాట్లాడుతూ.. గతేడాది కురిసిన భారీ వర్షాలతో కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ వర్షాకాలంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కామారెడ్డి మున్సిపాలిటీ ముందస్తుగా నడుం బిగించిందన్నారు. ప్రజల భద్రత, సౌకర్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు.

Flood Prevention | వర్షం నీరు నిలవకుండా..

వర్షపు నీరు ఎక్కడా నిలిచిపోకుండా, డ్రైనేజీలు సాఫీగా సాగేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గతంలో కామారెడ్డి డిగ్రీ కాలేజీ (Kamareddy Degree College) గోడ కూలిపోయి కాకతీయ నగర్, ఎన్జీవోస్ కాలనీలో ఇళ్లలోకి వర్షం నీరు రావడం కారణంగా 14, 35 వార్డుల ప్రజలు నష్టపోయారని వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంత్ రావు, కౌన్సిలర్లు అంజాద్, నిట్టు గంగాధర్, నాయకులు గణేష్, రామ్మోహన్, మోతిలాల్, భూపతి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

kamareddy 4

ఇది కూడా చదవండి: Ponguleti Srinivasa Reddy | ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *