Medicover 3K Walkathon | మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 3కే వాక్‌థాన్

నగరంలోని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 3కే వాక్‌థాన్​ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Medicover 3K Walkathon | నగరంలోని (Nizamabad) మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals) ఆధ్వర్యంలో 3కే వాక్‌థాన్​ నిర్వహించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

Medicover 3K Walkathon | బైపాస్​ నుంచి ఎల్లమ్మగుట్ట వరకు..

బైపాస్ చౌరస్తా నుంచి ఎల్లమ్మగుట్టలోని మెడికవర్ హాస్పిటల్స్ వరకు ఈ వాక్‌థాన్ కొనసాగింది. కార్డియాలజిస్ట్ డా. సందీప్ రావు జెండా ఊపి వాక్​థాన్​ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రతిరోజూ నడక, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చని తెలిపారు. కార్డియాలజిస్ట్ డా. జగదీష్ చంద్ర బోస్ మాట్లాడుతూ గుండె సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా వైద్యులను సంప్రదించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్డియోథొరాసిక్ సర్జన్ డా.రాకేష్ మాట్లాడుతూ గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరమని తెలిపారు.

సెంటర్ హెడ్ కె. స్వామి మాట్లాడుతూ ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ వాక్‌థాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో అన్ని ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్డియాలజిస్టులు డా.రవికిరణ్, డా.వరీస్ అలీ, సతీష్ యూరాలజిస్ట్ తో పాటు ఇతర వైద్యులు, మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: శిలా తోరణం వరకు.. తిరుమలలో భక్తుల రద్దీ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *