Pocharam Village Development  | పోచారం గ్రామ అభివృద్ధికి రూ.8 కోట్ల నిధులు..: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షర టుడే, ఎల్లారెడ్డి: నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) తెలిపారు. శుక్రవారం గ్రామంలో పర్యటించిన ఆయన నూతన మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, రైతుల భూ సమస్యలపై సమావేశం నిర్వహించారు.

Pocharam Village Development | మహిళా సంఘ భవనానికి భూమిపూజ

గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో నూతన తరగతి గదుల నిర్మాణానికి రూ.13.55 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. నిధుల మంజూరుపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Pocharam Village Development | రైతుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

సర్వే నంబర్ 268కు సంబంధించిన రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే వారి భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి త్వరలో భూముల రీ-సర్వే నిర్వహించి, సంబంధిత సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండల సర్వేయర్, తహశీల్దార్, ఎంపీడీవోల నుంచి పూర్తి నివేదిక తీసుకున్న అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Pocharam Village Development | గ్రామానికి రూ.30 లక్షలతో సీసీ రోడ్లు

పోచారం గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వివరించారు. గ్రామంలో సుమారు రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టు వద్ద మరో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. పోచారం ప్రాజెక్టు అభివృద్ధి, గెస్ట్‌హౌస్ నిర్మాణం తదితర పనుల కోసం సుమారు రూ.8 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. అలాగే గ్రామానికి 36 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పోచారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Yellareddy Government Hospital | వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే మదన్​మోహన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *