అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asian Games | జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో రజత పతకాన్ని కైవసం చేసుకోగా.. టీమ్ ఈవెంట్లో సైతం సిల్వర్ దక్కించుకుంది.
ఎలావెనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్శ వినోద్‌లతో కూడిన జట్టు 10 ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో సిల్వర్ సాధించింది. చైనా బంగారు పతకం గెలుచుకుంది. అనంతరం జరిగిన వ్యక్తిగత విభాగం పోటీల్లో ఎలావెనిల్ వలరివన్ రజతం గెలిచింది. దీంతో భారత్ షూటింగ్ రెండు పతకాలతో ఆసియా గేమ్స్‌లో శుభారంభం చేసింది.
Asian Games | హాకీలో విజయం
భారత్ మహిళల హాకీ జట్టు ఉజ్బెకిస్తాన్ను 19-0 తేడాతో చిత్తుగా ఓడించింది. వుషులో సూరజ్ సింగ్ కాంస్య పతకం కోసం జరిగిన ప్లేఆఫ్‌లలో రెండుసార్లు ఓడిపోయి వెనుదిరిగాడు. మహిళల క్రికెట్ జట్టు సెమీ-ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టేబుల్ టెన్నిస్‌లో మహిళల టీమ్ ఇండోనేషియాను 3-0 తేడాతో ఓడించింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మహిళల 60 కేజీల విభాగంలో భారత ప్లేయర్ సుచిక తరియల్ సెమీస్‌కు చేరింది. దీంతో ఆమెకు పతకం ఖాయం అయింది. షూటింగ్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు.
Another Silver for Elavenil Valarivan!
Heartiest congratulations to Elavenil Valarivan on securing the Silver Medal in the Women’s 10m Air Rifle Individual event at the #AsianGames2026.#Cheer4Bharat pic.twitter.com/sfZG1RnOn6
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 20, 2026
దీనిని కూడా చదవండి : Punjab Encounter | పంజాబ్ పోలీసు హత్య కేసు.. నిందితుడి ఎన్కౌంటర్