అక్షరటుడే, వెబ్‌డెస్క్: Opposition MPs Protest | కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. అయోధ్యలోని రామమందిర విరాళాల దుర్వినియోగం, విద్యార్థులపై లాఠీచార్జీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జులై 20న విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారనే ప్రశ్నలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని ‘ఇండియా’ కూటమికి చెందిన పలు పార్టీల ఎంపీలు నిరసన తెలిపారు. విద్యార్థులపై బలప్రయోగం, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి ఇచ్చిన విరాళాలలో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కేంద్రం బాధ్యత వహించాలని చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సైతం పాల్గొన్నారు. సభకు అమిత్ హాజరు కావాలని ఆమె డిమాండ్ చేశారు.
Opposition MPs Protest | నిరసనలు కొనసాగుతాయి
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఎత్తిచూపడమే ఈ నిరసన ఉద్దేశమన్నారు. ఆందోళనకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ప్రతిరోజూ ఇలాంటి నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసుల అరాచకలపై హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని, ప్రధాన మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో జవాబుదారీతనం ఉండాలని తమ పార్టీ డిమాండ్‌ను సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి..: LIC Dividend | కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ రూ.12,207 కోట్ల భారీ డివిడెండ్