LIC Dividend | కేంద్ర ప్రభుత్వానికి ఎల్‌ఐసీ రూ.12,207 కోట్ల భారీ డివిడెండ్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,853 కోట్లు, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ రూ.211 కోట్లు డివిడెండ్‌గా కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: LIC Dividend | దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ను అందజేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ₹ 12,207.25 కోట్ల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్లు సంస్థ వెల్లడించింది.

Telangana Police Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. పోలీస్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల

LIC Dividend | నిర్మలా సీతారామన్‌కు అందజేత

ఎల్‌ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మొహంతి స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఈఓ దొరైస్వామి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు డివిడెండ్‌ చెక్కును అందజేశారు.

LIC Dividend | ఈక్విటీ షేరు ₹ 10

కంపెనీ డైరెక్టర్ల మండలి ఒక్కో ఈక్విటీ షేరుకు ₹ 10 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. అలాగే, 2026 మార్చి 31 నాటికి ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలువ ₹ 59.03 లక్షల కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది.

ఆర్థిక నిర్వహణకు తోడ్పాటు

ఇక ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు కూడా కేంద్రానికి డివిడెండ్లు చెల్లించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,853 కోట్లు, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ రూ.211 కోట్లు డివిడెండ్‌గా కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది.

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అందుతున్న డివిడెండ్లు కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక నిర్వహణకు తోడ్పడతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *