అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Police Jobs | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్పీఎల్ఆర్బీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలో పోలీస్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో సిబ్బంది భర్తీకి గతంలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు టీఎస్ఎల్పీఆర్బీ నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసింది. 148 ఎస్సై (సివిల్) , 14 ఏఆర్ ఎస్సై, 14 టీజీఎస్పీ ఎస్సై, 3 ఎస్ఏఆర్సీపీఎల్, ఏఎస్సై 23, స్టేషన్ ఫైర్ ఆపరేటర్ 39, 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 ఏఆర్ కానిస్టేబుల్, 1,380 ఎసీపీఎఫ్ కానిస్టేబుల్, 44 ఎసీపీఎఫ్ ఎస్సై, 751 ఫైర్ ఫైటర్ పోస్టులను భర్త చేయనున్నారు.
Telangana Police Jobs | ఇలా దరఖాస్తు చేసుకోవాలి
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్, ఎన్సీసీ విద్యార్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఇచ్చారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్, ఎస్సై పోస్టులకు డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. అభ్యర్థులు కుల, ఆదాయ, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవాలని బోర్డు పేర్కొంది. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలో త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
దీనిని కూడా చదవండి : POCSO Case | బాలికపై అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు