Cannabis Seizure | ఎయిర్​పోర్టులో భారీగా గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్​ఐ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cannabis Seizure | శంషాబాద్ విమానాశ్రయంలో (Airport) డీఆర్​ఐ (DRI) అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. నిందితులు ఎలక్ట్రిక్ గీజర్‌లో దాచి గంజాయిని తీసుకొచ్చారు. అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేశారు. 7.75 కిలోల అత్యంత నాణ్యమైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2.71 కోట్లు ఉంటుందని అంచనా.

Cannabis Seizure | బ్యాంకాక్​ నుంచి..

పక్కా సమాచారం మేరకు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడిని హైదరాబాద్ జోనల్ యూనిట్ DRI అధికారులు అడ్డగించారు. అనంతరం అతడి లగేజీని తనిఖీ చేశారు. అందులో ఒక ఎలక్ట్రిక్ గీజర్ లభించింది. ఆ పరికరాన్ని తెరిచి చూడగా, మొత్తం 7.750 కిలోల 73 ప్యాకెట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌ను ఉపయోగించి పరీక్షించగా, ఆ పదార్థం గంజాయి అని తేలింది. దానిని స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

దీనిని కూడా చదవండి : Electricity Demand | ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్​ డిమాండ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *