Retired SI Son Death | అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్​ ఎస్సై కుమారుడి మృతి

రిటైర్డ్​ ఎస్సై కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Retired SI Son Death | రిటైర్డ్​ ఎస్సై కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫామ్​హౌస్​లో పుట్టిన రోజు వేడుకలకు హాజరైన అతడు చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది.

ఉప్పల్​ భగయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడైన కృష్ణ బీటెక్​ చదువుతున్నాడు. తన స్నేహితుడు రిషబ్‌తో కలిసి ఆదివారం రాత్రి పుట్టిన రోజు పార్టీకి హాజరయ్యాడు. ఈ క్రమంలో కృష్ణ కుప్పకూలి అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని తండ్రికి స్నేహితులు సమాచారం అందించారు. అనంతరం అతడిని ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు.

Retired SI Son Death | పోలీసులకు ఫిర్యాదు

తన కుమారుడి మరణం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అతని తండ్రి, ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి..: RTC Weekly Pass | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. రూ.600లకే వారం పాస్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *