అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ganjai Seized Malkajgiri | మల్కాజ్‌గిరిలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఎక్సైజ్ పోలీసులు 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. పోలీసులు, ఈగల్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. గంజాయి విక్రయాలు ఆగడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నగరంలో విక్రయాలు చేపడుతున్నారు. యువత, విద్యార్థులు ఈ మాదకద్రవ్యానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టగా తాజాగా ముగ్గురు దొరికారు.
Ganjai Seized Malkajgiri | ఆటోస్టాండ్ వద్ద
మల్కాజ్గిరి ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్.కె. నగర్ ఆటో స్టాండ్ వద్ద సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బప్పా అనే వ్యక్తి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. అతడి నుంచి 7.163 కిలోల ఎండు గంజాయి, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Ganjai Seized Malkajgiri | ఇద్దరు మహిళల అరెస్ట్
సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయం సమీపంలో మల్కాజ్గిరి జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు దాడి గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మదురైకి చెందిన ఇందు రాణి, రాజమ్మల్ పంజగం అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 21 కిలోల గంజాయి, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో నిందితులు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ గంజాయిని తీసుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి..: Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఐదుగురికి జరిమానా