అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Benson Raju Appointment | సేవాదళ్ కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా (Nizamabad District) అధ్యక్షుడిగా సంధి బెన్సన్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సంధి బెన్సన్ రాజు నియామక పత్రాన్ని అందుకున్నారు.
Benson Raju Appointment | క్రమశిక్షణతో పనిచేస్తా
బెన్సన్ రాజు మాట్లాడుతూ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అప్పగించిన బాధ్యతను పూర్తిస్థాయిలో క్రమశిక్షణ, నిబద్ధతతో నిర్వర్తించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన పీసీసీ మహేష్ కుమార్ గౌడ్‌కు, రాష్ట్ర సేవాదళ్ ఇన్‌ఛార్జి యూసఫ్ జాహీకి, రాష్ట్ర సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Singur Water Supply | సింగూరు నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరా