అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Fall | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, సౌదీ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం కావడంతో మళ్లీ ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరింది. పెరిగిన ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మూడు సెషన్ల తర్వాత నష్టాలతో ముగిశాయి.
Stock Market Fall | వడ్డీ రేట్ల పెంపు భయాలు…
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 6.09 శాతానికి చేరింది. ఇది ఆర్బీఐ (RBI) నిర్దేశించిన 6 శాతం గరిష్ట పరిమితిని దాటడంతో.. ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలు మార్కెట్‌ను వెన్నాడాయి. మార్కెట్ల పతనానికి ఇది కూడా కారణం.
Stock Market Fall | రోజంతా నష్టాల్లోనే..
సెన్సెక్స్ శుక్రవారం ఉదయం 78 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 533 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుని 579 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 90 పాయింట్ల గ్యాప్ డౌన్లో ప్రారంభమై మరో 132 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 169 పాయింట్లు ఎగబాకింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. చివరికి సెన్సెక్స్ 318 పాయింట్ల నష్టంతో 81,592 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 25,144 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,965 కంపెనీలు లాభపడగా 2,462 స్టాక్స్ నష్టపోయాయి. 245 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 147 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 55 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో, 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌యూఎల్ 1.22 శాతం, ఆసియన్ పెయింట్ 0.87 శాతం, ఎయిర్టెల్ 0.69 శాతం, రిలయన్స్ 0.41 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.41 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎం అండ్ ఎం 2.13 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.65 శాతం, బీఈఎల్ 1.60 శాతం, ఎన్టీపీసీ 1.18 శాతం, ట్రెంట్ 1.09 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Crash | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు