Konda Sushmitha | నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి సీఎం రేవంత్​రెడ్డి ఎవరని కొండా సుష్మిత అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Sushmitha | మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్​ ప్రకటించడానికి రేవంత్​రెడ్డికి ఏం అధికారం ఉందని ఆమె ప్రశ్నించారు. ఓ టీవీ ఛానెల్​తో మాట్లాడుతూ.. సీఎంపై విమర్శలు చేశారు.

కాంగ్రెస్​లో కొండా ఫ్యామిలీ తీరుతో చిచ్చురేగిన విషయం తెలిసిందే. కొండా సుష్మిత ఇటీవల సీఎంపై అనేక ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా కుటుంబానికి వ్యతిరేకంగా ఏకం అవుతునారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి సుష్మిత రేవంత్​రెడ్డిపై మండిపడ్డారు. తన టార్గెట్​ రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. తాను పార్టీని విమర్శించలేదని, రేవంత్ రెడ్డిని మాత్రమే విమర్శించానని పేర్కొన్నారు.

Konda Sushmitha | అవినీతికి పాల్పడుతున్న సీఎం

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకు గౌరవం ఉందని సుష్మిత తెలిపారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అతని సోదరులు విపరీతమైన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే అతన్ని టార్గెట్ చేశానని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి ఆయనకు ఏం అధికారం ఉందన్నారు. ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు. తాను పరకాలలో ఇండిపెండెంట్​గా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Konda Sushmitha | కొండా కుటుంబాన్ని సస్పెండ్ చేయాలి

కొండా సుష్మిత వ్యాఖ్యలతో ఆమె తల్లి సురేఖ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్​ పార్టీ ఆమెకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. దీనికి ఆమె వివరణ కూడా ఇచ్చారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె అభిప్రాయాలకు సంబంధించినవి అన్నారు. దానికి తనను బాధ్యురాలిని చేయడం తగదని సురేఖ పేర్కొన్నారు. మరోవైపు కొండా కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వ్యతిరేక వర్గం డిమాండ్​ చేస్తోంది. ఈ మేరకు టీపీసీసీకి తీర్మానం చేసి పంపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొండా సురేఖకు ఇతర కాంగ్రెస్ నాయకులకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా సుష్మిత చేసిన వ్యాఖ్యలతో సురేఖ కుటుంబం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Rupareddy Murder | ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య.. ఇది ఒక్క నేరం కాదు.. మనందరికీ ఒక హెచ్చరిక

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *