Ponguleti Srinivasa Reddy | నిషేధిత జాబితాలో కొత్తగా భూములు చేర్చలేదు : మంత్రి పొంగులేటి

తాము అధికారంలోకి వచ్చాక నిషేధిత జాబితాలో కొత్తగా భూములు చేర్చలేదని మంత్రి పొంగులేటి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల (Prohibeted Lands) విషయంలో ఏ పేదవాడికీ, నిజమైన భూహక్కుదారుడికీ అన్యాయం జరగకుండా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వారి హక్కులను కాపాడటంతో పాటు ప్రభుత్వ భూములను రక్షిస్తామన్నారు.

కాంగ్రెస్ (Congress)​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి పొంగులేటి తెలిపారు. వివాదాలు లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 22ఏ అంశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధికారులు పూర్తిగా అర్థం చేసుకుని అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన వ్యక్తికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూములు కాపాడటం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.

Ponguleti Srinivasa Reddy | దరఖాస్తులు పరిష్కరించాలి

22ఏ కు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు. తహశీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని సూచించారు. ప్రజావాణిలో ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను కూడా ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే విచారణ పూర్తి చేసి విధిగా ప‌రిష్క‌రించాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Bomma Mahesh Kumar | హరీష్​రావు తమిళనాడులో క్షుద్రపూజలు చేయలేదా : పీసీసీ చీఫ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *