Yoga Day Awareness | యోగాతో ఆరోగ్యం పదిలం.. : ఎమ్మెల్యే ధన్​పాల్​

యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని.. ప్రతిఒక్కరూ యోగా చేసేందుకు ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు : Yoga Day Awareness | యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని.. ప్రతిఒక్కరూ యోగా చేసేందుకు ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే ధన్​పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో యోగా దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు.

Yoga Day Awareness | 21న యోగా దినోత్సవం..

Yoga Day Awareness

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ యోగా చేయాలని.. అయితేనే ఆరోగ్యమైన సమాజం రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రపంచంలోని 177 దేశాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె గంగాదాస్, రెడ్​క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా యాత్ ఆఫీసర్ రమేష్, ఆయుష్ డీపీఎం వందన, డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మిసిస్ట్​లు ఆయుష్ పురుషోత్తం, ఉమాప్రసాద్, యోగా అసోసియేషన్ ప్రతినిధులు సంగీత, ఆయుష్ శాఖ సిబ్బంది రమేష్, విశాల్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Drunk and Drive Case 1 | డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.. 434 మందికి కోర్టు శిక్ష

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *