అక్షరటుడే వెబ్‌డెస్క్: US Tariffs on Russian Oil | రష్యా నుంచి క్రూడాయిల్ , గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారతదేశంతో పాటు మరో ఐదు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump )భారీ ఉపశమనం ఇచ్చారు. రష్యా ఇంధన దిగుమతులపై 100 శాతం వరకు ప్రతిపాదించిన దిగుమతి సుంకాల (టారిఫ్‌లు) అమలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆయన శుక్రవారం ఒక కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. జాతీయ ప్రయోజనాలు, గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరల నియంత్రణను దృష్టిలో ఉంచుకునే ఈ వెసులుబాటు కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్లో ధరల స్థిరత్వం కోసం రష్యా నుంచి మొదట 3 లక్షల టన్నులకు పైగా డీజిల్ దిగుమతి చేసుకునేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ వెల్లడించారు.
US Tariffs on Russian Oil | ముప్పు తప్పినట్లే..
అమెరికా కాంగ్రెస్ అక్టోబర్‌లో ఆమోదించిన ‘ది లిండ్సే ఓ. గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ చట్టం ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ఏకంగా 100% పన్నులు విధించే అధికారం వైట్‌హౌస్‌కు లభించింది. ఒకవేళ ఈ పన్నులు అమలులోకి వచ్చి ఉంటే భారత్‌కు తీవ్ర నష్టం వాటిల్లేది. ఎందుకంటే మన దేశం తన ఇంధన అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతుల పైనే ఆధారపడుతోంది. అందులోనూ ఒక్క ఆగస్టు నెలలోనే భారత మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఏకంగా 45 శాతంగా నమోదైంది.
US Tariffs on Russian Oil | భారత వైఖరి..
ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. గ్లోబల్ మార్కెట్లో లభ్యత, దేశ ఇంధన భద్రత ప్రాతిపదికన మాత్రమే భారత నిర్ణయాలు ఉంటాయని పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హొర్ముజ్ జలసంధిలో రవాణా ఆటంకాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉండటంతోనే, అమెరికా ఈ ఆంక్షలను పక్కన పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా చమురును మార్కెట్ నుంచి పూర్తిగా తొలగిస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయని గ్రహించిన ట్రంప్ యంత్రాంగం ఈ సుంకాల మినహాయింపు నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Madiga Employees Union | మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కమిటీ ఎన్నిక