Telangana Road Safety | రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : మంత్రి పొన్నం ప్రభాకర్​

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Road Safety | రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) అన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో రహదారి భద్రతా నిధుల సమర్థ నిర్వహణ, పర్యవేక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు.

రహదారి భద్రతా సెస్ మొత్తాన్ని రోడ్ల అభివృద్ధికి కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర రహదారి భద్రతా మండలి ద్వారా ఈ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ అకౌంటింగ్ విధానాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రహదారి భద్రతా కమిటీకి అందుబాటులో ఉండేలా వివరాలను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పారు.

Telangana Road Safety | కలెక్టర్లకు ఆదేశాలు

అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా రహదారి భద్రతా కమిటీలను వెంటనే క్రియాశీలం చేయాలని పొన్నం ప్రభాకర్​ ఆదేశించారు. ప్రతి నెలా సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (రహదారి భద్రత) కార్యాలయాన్ని రాష్ట్ర రహదారి భద్రతా మండలి పరిధిలోకి తీసుకువచ్చి, శాఖల మధ్య పూర్తి సమన్వయం సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి, రహదారులను ప్రయాణికులకు సురక్షితంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Palapitta | దసరా రోజు పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *