అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy SIR Remarks | సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ అమలైన రాష్ట్రంలోనే బీజేపీ గెలిచిందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్ కుట్ర ద్వారా బీజేపీ లబ్ధి పొందిందని ఆరోపించారు. ఎస్ఐఆర్ అమలు చేయని రాష్ట్రాల్లో ఇతర పార్టీలు గెలిస్తే.. SIR అమలు చేసిన రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందన్నారు. గతంలో భగత్‌సింగ్ నేతృత్వంలో వినిపించిన ‘సైమన్ గో బ్యాక్’ నినాదం దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి ఊతమిచ్చిందని, ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘జ్ఞానేశ్ కుమార్ గో బ్యాక్’ అనే నినాదం వినిపిస్తోందని పేర్కొన్నారు. ఈ నినాదంతో బీజేపీ నుంచి భారతదేశానికి విముక్తి లభించే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు.
Revanth Reddy SIR Remarks | దారి తప్పింది
దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని సీఎం అన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతీ భారతీయుడికి ఓటు హక్కు వచ్చిందన్నారు. అంబేడ్కర్ ఎంతో అధ్యయనం చేసి ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారు. ఓటు హక్కు ఇచ్చేందుకే నాడు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టారని, అప్పట్లో మంచి ఉద్దేశంతో ప్రారంభమైన SIR ఇప్పుడు దారి తప్పిందన్నారు. ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన పార్టీలు కాంగ్రెస్, సీపీఐ మాత్రమేనని పేర్కొన్నారు. అధికారం కోసమే కొన్ని పార్టీలు పుట్టాయని, ఎస్ఐఆర్ ప్రక్రియతో కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Dubai Bathukamma Celebrations | దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..