Dubai Bathukamma Celebrations | దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

దుబాయ్​లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dubai Bathukamma Celebrations | దుబాయ్​లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి.

Dubai Bathukamma Celebrations | రాష్ట్రంలో బీఆర్​ఎస్​ నేతలు..

ఈ వేడుకలకు తెలంగాణ (Telangana) నుంచి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తను ఈటీసీఏ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలకు వేలాదిగా తరలివచ్చిన తెలంగాణ మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. విదేశీ గడ్డపై ఉంటూ కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వాటిని పరిచయం చేస్తున్న ఈటీసీఏ ప్రతినిధులను, బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ ఆడపడుచులను బిగాల గణేశ్ గుప్త అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్,జీవన్ రెడ్డి, షకీల్, ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Metro Common Pass | తగ్గనున్న మెట్రో, ఆర్టీసీ కామన్​ పాస్​ ధరలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *