అక్షరటుడే వెబ్డెస్క్: Cockroach Janata Party Protest | ఢిల్లీలోని ( Delhi ) జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు తమకు అనుమతి నిరాకరించడంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలకు 10 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలన్న ఢిల్లీ పోలీసుల నిబంధనపై పార్టీ ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్ సోమవారం స్పందించారు. ఎప్పుడు, ఏ సమయంలో నిరసన చేయాలో పోలీసులే నిర్ణయించి చెప్పాలని, ఇందుకోసం వారికి 24 గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు.
Cockroach Janata Party Protest | మార్గదర్శకాలను పాటించలేదని..
జంతర్ మంతర్ వద్ద ధర్నాలకు అనుమతి నిరాకరించడంపై ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ స్పందిస్తూ.. గతంలో అనుమతి ఇచ్చినప్పుడు సీజేపీ తమ హామీలను, మార్గదర్శకాలను పాటించలేదని తెలిపారు. ఆ ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు, ప్రస్తుతం నగరంలో నెలకొన్న శాంతిభద్రతలు, ప్రజల రక్షణ, ట్రాఫిక్ సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Cockroach Janata Party Protest | కఠిన చర్యలు..
ప్రస్తుతం జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’ (BNSS) సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలను కాపాడేందుకే ఈ నియమాలు విధించామని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Bollaram Child Murder Case | బొల్లారం చిన్నారి హత్య కేసులో నిందితుడి అరెస్ట్