Palapitta | దసరా రోజు పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు

దసరా రోజు పాలపిట్టను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Palapitta | తెలంగాణ (Telangana) వ్యాప్తంగా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు.

పండుగ రోజు ఉదయం ప్రజలు పాలపిట్టను చూడటానికి వెళ్తారు. దానిని చూసిన తర్వాత స్థానిక ఆలయాల్లో పూజలు చేస్తారు. అయితే పాలపిట్టల సంఖ్య తగ్గిపోవడంతో గ్రామాల్లో అవి కనిపించడం లేదు. ఇక పట్టణాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది దసరాకు ముందు పాలపిట్టలను పట్టుకుంటున్నారు. అనంతరం వాటిని పంజరంలో బంధించి.. పట్టణాలు, నగరాల్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. దసరా మండపాలు, ఆలయాల్లో పాలపిట్ట దర్శనం పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

Palapitta | ప్రదర్శించడంపై నిషేధం

దసరా మండపాల్లో ‘పాలపిట్ట’ను ప్రదర్శించడం నిషేధించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ‘పాలపిట్ట’ను దసరా మండపాల్లో ప్రదర్శించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు, దసరా మండపాల నిర్వాహకులు, ప్రజలు పండుగ సమయంలో ఈ పక్షిని ప్రదర్శించకుండా ఉండాలని కోరుతూ అటవీ శాఖ ప్రత్యేక పోస్టర్లను రూపొందించింది. అంతేగాకుండా ప్రత్యేక వీడియోను కూడా పోస్ట్ చేసింది. పాలపిట్టను చూడాలి అనుకుంటే గ్రామాలకు వెళ్లాలని కోరింది. అంతేగాని వాటిని బంధించి, హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఇది కూడా చదవండి..: Car Racing Accident | మహిళ ప్రాణాలు తీసిన యువకుల కారు రేసింగ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *