అక్షరటుడే, వెబ్డెస్క్ : DMK MPs Meeting | ఓ వైపు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండగా.. మరోవైపు కేంద్రం డీలిమిటేషన్ బిల్లును మళ్లీ తీసుకు రావాలని యోచిస్తోంది. ఈ క్రమంలో డీఎంకే అధినేత స్టాలిన్ పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఎస్ఐఆర్పై ఈ మీటింగ్లో చర్చించనున్నట్లు సమాచారం. నిరసనకారులపై జరుగుతున్న అణచివేతను స్టాలిన్ (Stalin) వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల అభిజిత్ దీప్కే అరెస్ట్ను సైతం ఆయన ఖండించారు. సీజేపీ పోరాటంలో డీఎంకే వారికి న్యాయ సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. తమిళనాడులో కాంగ్రెస్తో విడిపోయినప్పటి నుండి డీఎంకే ఇండియా కూటమికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో కొత్త ఫ్రంట్ ప్రారంభించాలని చూస్తున్నట్లు సమాచారం.
DMK MPs Meeting | డీలిమిటేషన్ బిల్లుపై..
కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, డీలిమిటేషన్ బిల్లును తీసుకు రావాలని చూస్తోంది. ఈ బిల్లుకు మద్దతు తెలపాలని డీఎంకేను సంప్రదించినట్లు సమాచారం. ఈ క్రమంలో స్టాలిన్ ఎంపీలతో సమావేశం కానుండటం గమనార్హం. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మీటింగ్ తర్వాత తెలిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Greater Noida Family Deaths | ఘోర విషాదం.. మ్యాగీ తిని ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి!