Anant Singh Controversy | నితీష్​ కుమార్​ కోసం 9 మందిని చంపించా.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం నితీష్​కుమార్​ కోసం తాను 9 మందిని చంపించినట్లు జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anant Singh Controversy | బీహార్​లో జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నితీష్​ కుమార్​ కోసం తాను 9 మందిని చంపించానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

శాసనమండలి ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి నీరజ్ కుమార్‌కు పార్టీ టికెట్ ఇవ్వడంపై అనంత్​ సింగ్​ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను విమర్శిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్‌ (Nitish Kumar)తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందన్నారు. ఆయనకు సహాయపడేందుకు తాను తొమ్మిది మందిని హత్య చేయించానని చెప్పారు. ఆయన రాజకీయంగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న సమయంలో తాను అండగా నిలిచానని అన్నారు. నీరజ్ కుమార్ గతంలో తనను వ్యతిరేకించారని గుర్తు చేస్తూ, అటువంటి వ్యక్తికి పార్టీ ఎందుకు అవకాశం ఇచ్చిందని ప్రశ్నించారు.

Anant Singh Controversy | ఆర్జేడీ విమర్శలు

ఈ వ్యాఖ్యలు బీహార్​ రాజకీయాల్లో పెద్ద దుమారన్ని రేపాయి. ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ నితీష్​కుమార్​పై తీవ్ర విమర్శలు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ హత్యలు జరిగాయని పార్టీ పేర్కొంది. బీహార్‌లో తన అధికారాన్ని నిర్మించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కుఖ్యాత నేర ముఠాలతో ఆయన చేతులు కలిపారని ఆరోపించింది. కాగా అనంత్​ సింగ్​ వ్యాఖ్యలపై జేడీయూ స్పందించింది. వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలను సీరియస్​గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం అనంత్​సింగ్​ యూ టర్న్​ తీసుకున్నారు. నితీష్ కుమార్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: DMK MPs Meeting | డీఎంకే ఎంపీలతో స్టాలిన్​ కీలక సమావేశం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *