అక్షరటుడే వెబ్డెస్క్: Tirupati Nomination Controversy | ఆంధ్రప్రదేశ్లో ( Andhra Pradesh ) స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థ (కార్పొరేషన్) కార్యాలయం వద్ద నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి తరఫున నామినేషన్ వేయడానికి వచ్చిన తనను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు.
Tirupati Nomination Controversy | బలవంతంగా లాక్కుని…
తిరుపతి కార్పొరేషన్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు తాను వెళ్తుండగా, టీడీపీ నాయకులు తనను అడ్డుకోవడమే కాకుండా చేతిలో ఉన్న పత్రాలను బలవంతంగా లాక్కుని వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరుపై కూడా ఆయన మండిపడ్డారు. ఓ డీఎస్పీ హోదా అధికారి స్వయంగా తన చేతిలోని నామినేషన్ కాగితాలను తీసుకుని టీడీపీ నాయకులకు అందజేశారని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై తనను నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Tirupati Nomination Controversy ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు..
కార్పొరేషన్ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఈ అక్రమాలపై ఎన్నికల సంఘానికి (ఈసీ) రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఎంపీ వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తనకే సెక్యూరిటీ సమక్షంలో రక్షణ లేకుండా అడ్డంకులు సృష్టిస్తే, ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ క్షీణించిందని, పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించకుండా టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని గురుమూర్తి విమర్శించారు.
ఇది కూడా చదవండి: Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్యపై దాడి..