అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bank Fraud Case | బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.3.5 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు (CBI Court) తీర్పునిచ్చింది. ఢిల్లీ (Delhi) లోని సీబీఐ కోర్టు మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
అమిత్ చతుర్వేది, సంజయ్ చతుర్వేది, ప్రవీణ్ జునేజా అనే ముగ్గురు 2009లో నకిలీ పత్రాలను సమర్పించి యూకో బ్యాంక్ (UCO Bank) నుండి రూ. 7 కోట్ల టర్మ్ లోన్ పొందారు. రుణం మంజూరు చేసిన అసలు ప్రయోజనం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఆ నిధులను మళ్లించి యూకో బ్యాంక్‌ను మోసం చేశారు. దీంతో ఆ బ్యాంక్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు 2009 ఏప్రిలో సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణలో, నిందితులు ఒకరితో ఒకరు కుట్ర పన్ని, రుణ నిధుల వినియోగాన్ని చూపేందుకు తప్పుడు సమాచారం అందించినట్లు అధికారులు గుర్తించారు.
Bank Fraud Case | రూ.3.5 లక్షల జరిమానా
దర్యాప్తు పూర్తయిన అనంతరం 2010జూన్‌లో సీబీఐ నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. న్యాయస్థానం, విచారణ అనంతరం, నిందితులను దోషులుగా నిర్ధారించి, తదనుగుణంగా శిక్ష విధించింది. ఒక్కొక్కరికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3.5 లక్షల జరిమానా వేసింది. సీబీఐ దర్యాప్తు చేసి, విచారించిన బ్యాంకు మోసాల కేసులలో అమిత్ చతుర్వేది, సంజయ్ చతుర్వేది, ప్రవీణ్ జునేజాలకు ఇది మూడవ శిక్ష కావడం గమనార్హం.
CBI COURT AWARDS 4 YEARS IMPRISONMENT WITH A FINE OF Rs. 3.5 LAKH EACH TO THREE ACCUSED IN A BANK FRAUD CASE pic.twitter.com/Ax2y8tuxBi
— Central Bureau of Investigation (India) (@CBIHeadquarters) August 18, 2026
దీనిని కూడా చదవండి : Free Police Job Training | పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ: సీపీ సాయిచైతన్య