అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Free Police Job Training | నిజామాబాద్(Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Free Police Job Training | దరఖాస్తు చేసుకోవాలి
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఉన్న ఆసక్తి గల యువతీయువకులకు తెలంగాణ పోలీస్ శాఖ నియామకాలకు ఉపయోగపడే విధంగా ఉచితంగా శిక్షణ ఇస్తామని సీపీ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా జారీ చేసిన గూగుల్ పామ్ లింక్ క్యూఆర్‌కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Free Police Job Training | స్క్రీనింగ్ టెస్ట్..
దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 23న ఆదివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని సీపీ తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని వారు మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో అటెండ్ కావాలని సూచించారు. అలాగే ఆర్మూర్ డివిజన్ అభ్యర్థులు క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో, బోధన్ డివిజన్ వారు బోధన్ జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలలో హాజరు కావాలని పేర్కొన్నారు.
Free Police Job Training | పరీక్ష విధానం..
ఉద్యోగార్థులకు ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు శిక్షణలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ రోజుల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకూ శిక్షణ ఉంటుందని వివరించారు. 2 నెలల శిక్షణ కాలంలో 10 గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తామని, అందరు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు క్రాంతి 9951943656 , 8712533273 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: ACB Case | అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కేసు