Khelo India Yoga Syllabus | ఖేలో ఇండియాలో యోగా సిలబస్ మార్చాలి

ఖేలో ఇండియా యోగా పోటీల సిలబస్​ను మార్చాలని తెలంగాణ యోగా అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Khelo India Yoga Syllabus | ఖేలో ఇండియా యోగా పోటీల సిలబస్​ను మార్చాలని తెలంగాణ యోగా అసోసియేషన్ (Yoga Competition) కోరింది. ఈ మేరకు అసోసియేషన్ (Telangana Yoga Association) ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Khelo India Yoga Syllabus | 1974 నుంచి..

దేశంలో 1974 నుండి యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలు నిర్వహిస్తుందని నాగిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపారు. అయితే యోగాకు సంబంధం లేని కొంతమంది దొడ్డి దారిన ఆయుష్ డిపార్ట్​మెంట్​ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫిలియేషన్ పొందినట్లు చెప్పారు. ఈ విషయమై యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోర్ట్ నుండి సంప్రదించగా సుదీర్ఘ చరిత్ర కలిగిన వైఎఫ్ఐ దేశంలో యోగా అభివృద్ధికి పాటుపడిందని రెండు నెలల్లోగా సమస్యను పరిష్కరించాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు తెలిపారు. భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న సిలబస్​తో కూడిన యోగా పోటీలను ఖేలో ఇండియాలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సిలబస్​తో పాటు అఫిలియేషన్ విషయాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖతో మాట్లాడనున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Principal Harassment | నా కోరిక తీరిస్తే కాలేజీ ఫీజు మాఫీ చేస్తా.. ప్రిన్సిపాల్​ వేధింపులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *