Young India School | కామారెడ్డికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరు..‘అక్షరటుడే’ కథనానికి స్పందన

కామారెడ్డి నియోజకవర్గానికి ప్రభుత్వం యంగ్​ ఇండియా స్కూల్​ను మంజూరు చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Young India School | ‘యంగ్ ఇండియా స్కూల్ కలేనా’ శీర్షికతో ఈ నెల 11న ‘అక్షరటుడే’లో (Akshara today) ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. నియోజకవర్గానికి(Kamareddy) స్కూల్ మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులు మంజూరు చేసింది. భిక్కనూర్ మండల కేంద్రంలో సర్వే నంబ.ర్ 671లో 20 ఎకరాల స్థలం అధికారులు కేటాయించగా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు సైతం కేటాయించింది.

Young India School | సకల సౌకర్యాలతో నిర్మాణం: షబ్బీర్ అలీ

ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలన్న ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​తో కలిసి ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్ల వ్యయంతో పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. భిక్కనూర్ మండల కేంద్రంలో 20 ఎకరాల్లో పాఠశాల నిర్మాణం జరుగుతుందన్నారు. మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మాణం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు బ్లాకులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మధ్యలో విశాలమైన మైదానం ఉంటుందని, అన్ని రకాల గేమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. కామారెడ్డికి గోదావరి జలాల పనుల తర్వాత ఇంత పెద్ద మొత్తం నిధులు మంజూరు కావడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.

Young India School | త్వరలోనే పనులు ప్రారంభం..

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కామారెడ్డిలో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు ఇవ్వాలని కోరానని షబ్బీర్ అలీ తెలిపారు. ఇప్పటికే జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు స్థలం కేటాయింపు పూర్తయిందని వెల్లడించారు. త్వరలోనే భిక్కనూర్​లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో పేద విద్యార్థులకు విద్యాబోధన అందుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి పాఠశాల మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి, భిక్కనూర్ సర్పంచ్ బల్యాల రేఖ, అదనపు కలెక్టర్ ఎన్.వై గిరి, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ పాల్గొన్నారు.

logo

 

ప్రభుత్వ సలహాదారుకు కృతజ్ఞతలు తెలిపిన భిక్కనూర్ కాంగ్రెస్ నేతలు

5567
మండల కేంద్రంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించేందుకు కృషిచేసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి భిక్కనూరు మండల కాంగ్రెస్ నేతలు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ మాట్లాడుతూ భిక్కనూరు అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎంతగానో సహకరిస్తున్నాడన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా భిక్కనూరు అభివృద్ధికి షబ్బీర్ అలీ ఎంతగానో కృషి చేశారన్నారు.  ఈ సందర్భంగా షబ్బీర్ అలీని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సుదర్శన్, భీమ్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: Ayodhya Ram Mandir SIT | అయోధ్య విరాళాల కేసులో కీలక పరిణామం.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాకు క్లీన్‌చిట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *