అక్షరటుడే, వెబ్డెస్క్: Bigg Boss 10 Agni Pariksha | ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు Telugu సీజన్-10కు సంబంధించిన కీలక అప్డేట్‌ను ‘స్టార్ మా’ వెల్లడించింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించాలనుకునే సామాన్య ప్రజలకు అవకాశం కల్పించే ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ఈ నెల ఆగస్టు 15 న స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది.
Karnataka Congress | కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. రాజీనామా చేసిన ఎమ్మెల్యే
Bigg Boss 10 Agni Pariksha | అధికారిక ప్రకటన ఎప్పుడో..
ఈ విషయాన్ని గత సీజన్ విజేత కళ్యాణ్ పడాల వెల్లడించారు. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాలనుకునే కామన్ పీపుల్స్‌కు నిర్వహించే ఆడిషన్ ప్రక్రియలో భాగంగానే ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
గత సీజన్‌ల మాదిరిగానే ఈసారి కూడా బిందు మాధవి, అభిజిత్, నవదీప్ జడ్జీలుగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ‘స్టార్ మా’ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బిగ్‌బాస్ సీజన్-10 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ఈ ప్రకటనతో మరింత ఉత్సాహం నెలకొంది.