Karnataka Congress | కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. రాజీనామా చేసిన ఎమ్మెల్యే

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka Congress | కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీకి షాక్​ తగిలింది. మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)లో అవకాశం రాని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్వంత్రయ గౌడ తన పదవికి రాజీనామా చేవారు. రేపు ఉదయం 10 గంటలకు రాజీనామా చేయనున్నట్లు బేలూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ ప్రకటించారు.

కర్ణాటక మంత్రివర్గాన్ని సోమవారం విస్తరించిన విషయం తెలిసిందే. 19 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తనకు అవకాశం దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యశ్వంత్‌రాయగౌడ పాటిల్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయగా, మరో ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ (సాగర్) కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Karnataka Congress | వారి పిల్లలకే అవకాశం

తాను నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని పాటిల్​ తెలిపారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మరోవైపు, గోపాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి, రాష్ట్ర అటవీ పరిశ్రమల సంస్థ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రులు, మంత్రుల పిల్లలైతేనే మంత్రి అయ్యే అవకాశం దక్కుతుందన్నారు. మరో మాజీ మంత్రి దినేష్ గుండూరావు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన ఆందోళనలను వ్యక్తం చేశారు. సీఎం డీకే శివకుమార్ (DK Shivkumar)​ స్పందిస్తూ.. అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదన్నారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Nizamabad GGH | నిజామాబాద్​ జీజీహెచ్​లో త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *