Naga Vamsi Comments | అందుకే థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు.. నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Naga Vamsi Comments | తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు (Producers), ఎగ్జిబిటర్ల మధ్య వివాదం పెద్దది అవుతోంది. నిన్న ఎగ్జిబిటర్లు సమావేశమై తమకు నష్టాలు వస్తున్నాయని, పర్సంటేజీ విధానం అమలు చేయాలని కోరారు. తాజాగా నిర్మాతలు సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నష్టాలు వస్తుంటే వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నష్టాలు వచ్చే థియేటర్లను వదిలేయాలని ఎగ్జిబిటర్లకు సూచించారు. తాము టికెట్ రేట్లు (Ticket Prices) పెంచడంతో జనాలు థియేటర్లకు రావడం లేదని సరికాదన్నారు. థియేటర్లలో పాప్ కార్న్, ఫుడ్, కూల్​డ్రింక్స్​ రేట్లు పెంచడంతో రావడం లేదని పేర్కొన్నారు. ముందు వాటి ధరలు తగ్గించాలని సూచించారు.

Naga Vamsi Comments | శిరీష్​కు కౌంటర్​

సింగిల్​ స్క్రీన్ ​ థియేటర్లలో ఇక నుంచి రేట్లు పెంచమని ఎగ్జిబిటర్​, నిర్మాత దిల్​ రాజు సోదరులు చెప్పిన విషయం తెలిసిందే. అంతేగాకుండా సింగిల్​ స్క్రీన్​ థియేటర్లకు నష్టాలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా నాగవంశీ స్పందించారు. ఏ నుంచి బీ, సీ సెంటర్ వరకు ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టిప్లెక్స్‌లు కట్టేసి, సింగిల్ స్క్రీన్స్‌కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్స్ కష్టాలు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని పరోక్షంగా విమర్శించారు.

Naga Vamsi Comments | వసతులు కల్పించాలి

ఎగ్జిబిటర్ ఎంత ముఖ్యమో, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. అలాంటిది డిస్ట్రిబ్యూటర్​ను చంపేసి, ఎగ్జిబిటర్​ను కాపాడాలి అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెరుగైన వసతులు కల్పిస్తే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు.

Naga Vamsi Comments | ఎవరు సంతోషంగా లేరు

ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందని మైత్రీ మూవీస్​ రవి అన్నారు. పెద్ది లాంటి పెద్ద సినిమా విడుదల సమయంలో వివాదం సృష్టించడం సరికాదన్నారు. సమస్య ఉందని, చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందామని కోరారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.

దీనిని కూడా చదవండి : Sirish Reddy Comments | థియేట‌ర్స్ న‌డ‌వ‌క‌పోతే మూసేయండి అన్న నిర్మాత.. ఇప్పుడు ఆయ‌న ఇండ‌స్ట్రీలోనే లేడంటూ కామెంట్

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *