అక్షరటుడే, వెబ్డెస్క్ : Kerala CM Suspense | కేరళంలో కాంగ్రెస్ కూటమి (UDF) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడి పది రోజులు కావొస్తున్న సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ వీడటం లేదు.
కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 102 స్థానాలను గెలుచుకుంది. భారీ విజయం సాధించిన ఆ పార్టీకి సీఎం ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే పలు దశల చర్చలు జరిగాయి. ఈ క్రమంలో రేపు కేరళం సీఎంను కాంగ్రెస్ ప్రకటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Kharge), లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సీఎం అభ్యర్థిపై చర్చించారు. రేపు నిర్ణయాన్ని ప్రకటిస్తామని జైరాం రమేష్ తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు.

Kerala CM Suspense | రేసులో ఉంది వీరే..
ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీసన్, సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల సీఎం రేసులో ఉన్నారు. పార్టీ గెలుపు కోసం వీరు తీవ్రంగా కృషి చేశారు. ఈ క్రమంలో పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పదేళ్ల తర్వాత కేరళంలో మళ్లీ అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. పార్టీలో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సీఎంగా ప్రకటించాలని చూస్తోంది. అయితే సీనియర్ నాయకుల మద్దతుదారులు ముఖ్యమంత్రి పదవి కోసం ఒత్తిడి చేయడంతో, అందరి దృష్టి ఒక్కసారిగా ముఖ్యమంత్రిని ప్రకటించే అంశంపైకి మళ్లింది.
Kerala CM Suspense | వారికే అవకాశం
కేరళంతో పాటు అస్సాం, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల అయ్యాయి. కాంగ్రెస్ గెలిచిన కేరళంలో తప్పా మిగతా అన్ని చోట్ల సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. కీలకమైన బెంగాల్లో సైతం బీజేపీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం అభ్యర్థిని ప్రకటించగలిగింది. అయితే కాంగ్రెస్ మాత్రం కేరళంలో ఎవరిని సీఎం చేయాలనే అంశంపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, లేదంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం అభ్యర్థులుగా ఎన్నికయ్యేవారు. అయితే ఈ సారి జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉండే కేసీ వేణుగోపాల్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయనను పలువురు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. సీఎం పేరు ప్రకటనతో పార్టీలో చీలిక రాకుండా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పదవి ఆశిస్తున్న అందరితో మాట్లాడింది.
#WATCH | Delhi: Congress General Secretary in-charge Communications, Jairam Ramesh says, “As authorised by the members of the CLP in Kerala, the high command of Congress has completed all discussions. The decision on who the next CM of Kerala will be announced tomorrow.” pic.twitter.com/A5PmNOn9dD
— ANI (@ANI) May 13, 2026
దీనిని కూడా చదవండి : Kharif MSP Hike | రైతులకు గుడ్న్యూస్.. పంటలకు పెరిగిన మద్దతు ధర

