Shreyas Iyer | సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై ప్రశ్నలు.. కెప్టెన్సీకి ఎసరు పెడుతున్న శ్రేయస్ అయ్యర్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shreyas Iyer | టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా అతని ప్రదర్శన నిరాశ కలిగిస్తోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఆటతీరు, కెప్టెన్సీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో టీమిండియా టీ20 కెప్టెన్సీపై చర్చలు వేడెక్కుతున్నాయి.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్, తన జట్టుని స‌క్సెస్ ఫుల్‌గా ముందుకు నడిపిస్తున్నాడు. ముఖ్యంగా మంబై ఇండియన్స్‌ Mumbai Indiansపై జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ప్రదర్శన సెలెక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.

Shreyas Iyer | సూర్య‌కి ఎస‌రు పెడుతున్న శ్రేయ‌స్‌..

ఇక సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే, గతేడాది నుంచి బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేయడం అతని ఫామ్‌పై అనుమానాలు రేకెత్తిస్తోంది. అంతేకాకుండా, టీ20 ప్రపంచకప్‌లో కూడా అతని ప్రదర్శన నిరాశపరిచింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో డకౌట్ కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. భవిష్యత్ టోర్నమెంట్‌లను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, తదుపరి టీ20 ప్రపంచకప్‌లను World Cup లక్ష్యంగా పెట్టుకుని, జట్టులో స్థిరమైన ప్రదర్శన చూపే ఆటగాళ్లకే కీలక బాధ్యతలు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ విషయంలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Shreyas Iyer | ఇప్పటికే కెప్టెన్​గా..

శ్రేయస్ అయ్యర్ Shreyas ayyer ఇప్పటికే కెప్టెన్‌గా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు చేర్చిన అతను, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌ను అగ్రస్థానంలో నిలబెడుతూ తన నాయకత్వ నైపుణ్యాన్ని మరోసారి చూపిస్తున్నాడు. ఇక ఇతర యువ ఆటగాళ్లు అయిన హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ కూడా మంచి ప్రదర్శన క‌న‌బ‌ర‌చ‌డంలో కొంత వెనుకబడి ఉండటం గమనార్హం. దీంతో టీమిండియా భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ త్వరగా ఫామ్‌లోకి రాకపోతే, టీమిండియా టీ20 కెప్టెన్సీలో మార్పు తప్పదనే అభిప్రాయం క్రికెట్ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. రాబోయే ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌ల తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది.

ఇది కూడా చదవండి..: IPL 2026 Viral Incident | ఐపీఎల్ 2026లో వైరల్ ఘటన.. నిమ్మకాయతో ‘చేతబడి’ చేసిన ఫ్యాన్, వెంటనే వికెట్!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *