అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Festival Traffic Safety | పండగ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ సీఐ సురేష్‌కుమార్ (Traffic CI Suresh Kumar) అన్నారు. నగర(Nizamabad) ట్రాఫిక్ సీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Festival Traffic Safety | పార్కింగ్ విషయంలో..
దసరా పండగ సందర్భంగా నగరంలోని ప్రధాన మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొందని సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో దొంగలు వాహనాలు చోరీ చేసే అవకాశం ఉందన్నారు. దీనికోసం వాహనదారులు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలోనే బైక్‌లు ఇతర వాహనాలు పార్క్ చేయాలని సూచించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్ గతంలో నిజామాబాద్‌లోనే సౌత్ రూరల్, మోపాల్ సీఐగా పనిచేశారు.
ఇది కూడా చదవండి: చెన్నైలో కుండపోత వర్షాలు