అక్షరటుడే, కామారెడ్డి: Free Legal Services | ప్రజలకు న్యాయ సేవలు చేరువ చేయడంలో పారాలీగల్ వలంటీర్లు, కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్పర్సన్ పి.ముక్తిద అన్నారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా కోర్టు హాలులో పీఎల్వీలు, సీఎంవీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
Free Legal Services | వారధిగా నిలవాలి
పీఎల్వీలు, సీఎంవీలు న్యాయ సేవాధికార సంస్థకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని పి.ముక్తిద సూచించారు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సహాయం, వారి హక్కులు, అందుబాటులో ఉన్న న్యాయ సేవలపై అవగాహన కల్పించాలని తెలిపారు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లు ప్రజల మధ్య తలెత్తే చిన్నచిన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంలో చొరవ చూపాలని సూచించారు.
మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సమాజంలో సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని వివరించారు. అనంతరం వలంటీర్ల విధులు, బాధ్యతలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, న్యాయ అవగాహన కార్యక్రమాల నిర్వహణ, మధ్యవర్తిత్వ సేవల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి, పీఎల్వీలు, సీఎంవీలు పుష్పవతి, సాయిబాబా, విజయ్ కుమార్, ఖలీల్ ఉల్లా, అలీమొద్దీన్, స్వప్న పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ‘Ranu Bombay Ki Ranu’ Reaches International Level! | Anchor Indu Shares Her Views