అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BRS Corruption Allegations | రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
BRS Corruption Allegations | బీఆర్ఎస్ హయాంలోనే జలదోపిడీ..
సీఎం కేసీఆర్ (KCR) ప్రభుత్వ హయాంలో హరీష్ రావు మంత్రిగా ఉన్నపుడు నీటి దోపిడి చేసింది నిజం కాదా అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. కాళేశ్వరం పేరిట రూ.లక్షల కోట్ల నీటి పాలు చేశారన్నారు. బీఆర్ఎస్ హయంలో విచ్చలవిడిగా భూదోపిడి చేసి అమాయక ప్రజల నుంచి అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతి చిట్టా పెద్దదన్నారు. మహనీయుల బిడ్డ రాహుల్ గాంధీ అని.. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆయన కోసం తెలంగాణ నుంచి మూటలు మోసే అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా విషయంలో చుక్క నీటిని సైతం వదులుకోమని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్తో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు.
BRS Corruption Allegations | కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువైంది..
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని పీసీసీ చీఫ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిపై వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందన్నారు. కొండా సురేఖ విషయంలోనూ మొదటి సారే చర్యలు తీసుకోలేదన్నారు. రెండుమూడు సార్లు పరిశీలించి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఫార్ములా ఈ కార్రేసు, కాళేశ్వరం, భూ కుంభ కోణాలకు పాల్పడి అడ్డంగా దొరికిన అవినీతి పరుడు కేటీఆర్ అని దుయ్యబట్టారు.
BRS Corruption Allegations | నగరంలో రేణుక ఎల్లమ్మ ఆలయంలో..
నగరంలోని ఆరో డివిజన్‌లో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నూతనంగా నిర్మించనున్న వంటశాల షెడ్డు నిర్మాణ పనులకు మహేష్ కుమార్ గౌడ్ భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, రాజిరెడ్డి, రామ్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: SI Preliminary Exam | ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు: సీపీ సాయిచైతన్య