అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Vemulawada Development | వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో ప్రతి దానికి గడువు విధించి.. వేగంగా పూర్తి చేయాలని వీటీఏడీఏ వైస్ ఛైర్పర్సన్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) ఆదేశించారు. కలెక్టరేట్లో ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
Vemulawada Development | వేములవాడ పట్టణంలో..
వేములవాడ పట్టణంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం, 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులపై కలెక్టర్ చర్చించారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రతి పనికి సంబంధించి ప్రత్యేకంగా కూలీల సంఖ్య పెంచాలన్నారు. పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఆర్అండ్బీ అధికారులు నిత్యం అభివృద్ధి పనులను పరిశీలిస్తూ.. వేగంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనుల్లో మిగతావి ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి, రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో కుమారి, ఆర్అండ్బీ ఈఈ భీమ్లానాయక్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Harish Rao Congress Remarks | కాంగ్రెస్ పని అయిపోయింది : హరీశ్‌రావు