Govt School Attendance | విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా కృషిచేయాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల : Govt School Attendance | జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) ఆదేశించారు. ఎఫ్ఆర్ఎస్, ఎఫ్ఎల్ఎన్, ఆన్​లైన్​ తరగతులు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై విద్యాశాఖ, పంచాయతీ రాజ్ శాఖ, టీజీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలెక్టరేట్​లో సమీక్షించారు.

Govt School Attendance | నిరంతర పర్యవేక్షణ ఉండాలి..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా టీచర్లు, విద్యాధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని పాలనాధికారి ఆదేశించారు. అన్ని విద్యాలయాల విద్యార్థులు తరగతులకు హాజరయ్యాలా ప్రోత్సహించాలని సూచించారు. బడికి హాజరు కాకపోవడానికి కారణాలు తెలుసుకోవాలని, నిత్యం వచ్చేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

Govt School Attendance | పనులకు అనుగుణంగా కూలీల సంఖ్య పెంచాలి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం నిర్మాణ పనులు పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. పనులకు అనుగుణంగా కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను మొదలుపెట్టాలని తెలిపారు. నాబార్డ్ నిధులతో విద్యాలయాల్లో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఉష కింద గంభీరావుపేట, అగ్రహారంలో నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని, వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.

Govt School Attendance | పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి

ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ ఆన్​లైన్​ తరగతులను అన్ని విద్యాలయాలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో తప్పనిసరిగా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రోజువారి, వారవారం పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ తరగతులను వినియోగించు కోవాలని పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.

Govt School Attendance | క్రమం తప్పకుండా నిర్వహించాలి

పేరెంట్ టీచర్ మీటింగ్​లో అన్ని విద్యాలయాల్లో క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు మెరుగు పర్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థులు చదవడం, రాయడం, గణితం ఇతర పాఠ్యాంశాలు రాసి.. చదివేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులను రానున్న వార్షిక పరీక్షలకు ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో విజయ సాగర్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, వివిధ మండలాల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Vemulawada Development | వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *