Auxilo Scholarship | విదేశీ, దేశీయ ఉన్నత విద్య కోసం ఆక్సిలో ఫిన్‌సర్వ్ స్కాలర్‌షిప్‌లు.. రూ.2.6 కోట్లకు సీఎస్ఆర్ నిధుల పెంపు

దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రముఖ విద్యా రుణ సంస్థ 'ఆక్సిలో ఫిన్‌సర్వ్' (Auxilo Finserve) కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Auxilo Scholarship |దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రముఖ విద్యా రుణ సంస్థ ‘ఆక్సిలో ఫిన్‌సర్వ్’ (Auxilo Finserve) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తమ విద్యా సంబంధిత కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కేటాయింపులను రెట్టింపు చేస్తూ రూ.2.6 కోట్లకు పెంచింది. దీని ద్వారా మెరిట్ ఆధారిత ‘ఇంపాక్ట్‌ఎక్స్’ (ImpactX) స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ విద్యార్థులకు కూడా విస్తరించడంతో పాటు, దేశీయ స్కాలర్‌షిప్‌లను కొనసాగించనుంది.

Auxilo Scholarship |స్కాలర్‌షిప్ వివరాలు..

విదేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ పథకం అండగా నిలుస్తుంది. గుర్తింపు పొందిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి (క్యాంపస్) స్టెమ్ (STEM), ఎంబీఏ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చేసే భారతీయ విద్యార్థులకు గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం 70 శాతం మార్కులు లేదా సమానమైన సీజీపీఏ సాధించి ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.7 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది, ఆపైన ఆదాయం ఉన్నవారి దరఖాస్తులను మొత్తం అర్హత ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తారు. ఆసక్తి గలవారు సంస్థ అధికారిక వెబ్‌సైట్ (auxilo.com/impactx-global) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Auxilo Scholarship | స్కాలర్‌షిప్ వివరాలు..

గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 కోట్లకు పైగా నిధులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాలకు చెందిన 141 మంది విద్యార్థులకు ఆక్సిలో అండగా నిలిచింది. దేశంలోని ఏఐసీటీఈ, యూజీసీ, నాక్ లేదా ఎన్‌బీఏ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, కంప్యూటర్ అప్లికేషన్స్, మేనేజ్‌మెంట్ తదితర పూర్తిస్థాయి యూజీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రతి సెమిస్టర్‌కు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు. కనీసం 70 శాతం మార్కులు, 18-35 ఏళ్ల వయసు, రూ.7 లక్షల వార్షిక కుటుంబ ఆదాయ పరిమితి (అంతకుమించిన వారికి ప్రత్యేక పరిశీలన) నిబంధనలు వర్తిస్తాయి. అర్హులైన విద్యార్థులు (auxilo.com/Impactx-scholarship) పోర్టల్ ద్వారా పత్రాలు సమర్పించవచ్చు.

Auxilo Scholarship | ప్రత్యేక ఏఐ ప్లాట్‌ఫామ్..

తక్కువ ఆదాయ కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులకు పెరుగుతున్న విద్యా ఖర్చులు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆక్సిలో ఫిన్‌సర్వ్ సీఈఓ, ఎండీ నీరజ్ సక్సేనా పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లు నిజమైన అర్హులకే అందేలా పటిష్ఠమైన తనిఖీలు, విద్యార్థుల ఇళ్ల సందర్శనతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన అంతర్గత ఏఐ (AI) ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏఐ వ్యవస్థ ‘సోషల్ ఇంపాక్ట్ స్కోర్’ ఆధారంగా పక్షపాతం లేకుండా అర్హులను ఎంపిక చేస్తుంది.

ఇది కూడా చదవండి: Vemulawada Development | వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *