Bodhan Railway Inspection | బోధన్ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్​ఎం.. గూడ్స్​ యార్డు ఏర్పాటుకు ప్రణాళికలు..

Shashi kiran Mottala
Bodhan Railway Inspection | బోధన్ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్​ఎం.. గూడ్స్​ యార్డ్ ఏర్పాటుకు ప్రణాళికలు..

అక్షరటుడే, బోధన్​: Bodhan Railway Inspection | బోధన్ రైల్వేస్టేషన్‌ను (Bodhan railway station) హైదరాబాద్ డివిజన్ (Hyderabad Division) రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) (Railway DRM) సంతోష్ కుమార్ వర్మ గురువారం తనిఖీ చేశారు. సాంకేతిక నిపుణులు, వివిధ విభాగాల అధిపతుల బృందంతో కలిసి వచ్చిన ఆయన స్టేషన్​లో మౌలిక సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యాలు, గూడ్స్ యార్డు ఏర్పాటు, భద్రతా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

Bodhan Railway Inspection | గూడ్స్​ యార్డు కోసం ప్రణాళిక..

ఈ సందర్భంగా డీఆర్​ఎం మాట్లాడుతూ.. స్టేషన్​ను గూడ్స్ యార్డు (Goods Yard) కోసం పునర్నిర్మాణం చేసేందుకు ప్రణాళికను రూపొందింస్తున్నామని.. ఈ క్రమంలో ఇక్కడి సదుపాయాలను నిశితంగా పరిశీలించామన్నారు. గూడ్స్​ యార్డు​ నిర్మాణం ద్వారా ఇక్కడి నుంచి సరుకు సరఫరాను మెరుగు పర్చేందుకు సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్ లేఅవుట్‌లను, అందుబాటులో ఉన్న భూమిని పరిశీలించి బ్లూప్రింట్‌ను సిద్ధం చేశామని వివరించారు.

ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల రవాణాను క్రమబద్ధీకరించడం, ఈ ప్రాంతంలో పరిశ్రమలు, వ్యవసాయ వాణిజ్యానికి బోధన్‌ను (Bodhan) కీలకమైన లాజిస్టిక్స్ నోడ్‌గా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఉన్నత స్థాయి తనిఖీలో రైల్వే ఉన్నతాధికారులు దుర్గాప్రసాద్​, హేమనాయక్​, ప్రశాంత సాయికృష్ణ, విజయ్​కుమార్​, శశాంత్​ నామ్​దేవ్​, లక్ష్మీనారాయణ, విద్యాధర్​, అనిరుధ్​ పమార్​, సృజన్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

drm

ఇది కూడా చదవండి: RTC Strike | తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. ఆర్టీసీ కార్మికులకు సీఎం విజ్ఞప్తి

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *